శుభవార్త.. తెలంగాణ అంతటా రుతుపవనాలు

ప్రతిపక్షం, జూన్ 23: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పూర్తిగా విస్తరించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం వచ్చే రెండు వారాల పాటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని, వాటి ప్రభావంపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవగా, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాల పూర్తిస్థాయి ప్రవేశంతో వ్యవసాయ పనులు మరింత ఊపందుకునే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News