ప్రతిపక్షం, ఆగస్టు 09: మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో మైనర్లు, యువకులను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలపై 22 ఏళ్ల చేతన్ ప్రకాశ్ కోలీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో 600కు పైగా అసభ్యకర వీడియోలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
డబ్బులు ఇస్తామని ఆశ చూపి మైనర్లను తనకు దగ్గర చేసుకునేవాడని, అనంతరం వారి వీడియోలను చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడేవాడని పోలీసులు వెల్లడించారు. గత నాలుగేళ్లుగా నిందితుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.
మొబైల్‌లో లభించిన వీడియోలు, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడి బాధితుల సంఖ్య, వీడియోలు ఎవరెవరికి పంపాడు అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.





























