- మెదక్ జిల్లా ఉద్యమకారుల సమన్వయ కమిటీ పిలుపు.
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూన్ 11: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలని మెదక్ జిల్లా ఉద్యమకారుల సమన్వయ కమిటీ సమన్వయకర్తలు బి కొండల్ రెడ్డి సడమెలా యాదగిరి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో. మెదక్, హవేలీ ఘనపూర్, వెల్దుర్తి రామయంపేట ,శంకరంపేట, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు గడిచిన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించారని ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన వారందరినీ గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ ,ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులను ఉద్యమకారులుగా గుర్తించాలి.జర్నలిస్టులను గుర్తించి తగిన విధంగా న్యాయం చేయాలి. తెలంగాణ ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా పాల్గొన్న నిరుద్యోగ యువతీ ,యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. 1969 లో పాల్గొన్న ఉద్యమకారులందరినీ గుర్తించి తగిన న్యాయం చేయాలి. ఏకగ్రీవంగా తీర్మానించింది ఈ సమావేశంలో .భూపాల్ రెడ్డి జెల్లా సుధాకర్. మేడిశెట్టి శ్యామ్ రావు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ నాయకులు మల్లికార్జున గౌడ్, మామిండ్ల ఆంజనేయులు విద్యార్థి నాయకులు కిరణ్ గౌడ్. శ్రీకాంత్ రూపేష్,యాదవ్ . టీఎన్జీవో నాయకులు , మనోహర్, శివాజీ, రఘు రిటైర్డ్ ఉపాధ్యాయులు ఏ రాధా కిషన్ ,డి.. జీవరత్నం ,కే. బాగయ్య. ఆర్టీసీ నాయకులు పి శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజ్ గౌడ్ .వెల్దుర్తి జేఏసీ నాయకులు వెంకటరమణ, యాదగిరి, రమేష్ గౌడ్ కొల్చారం జెఎసి కన్వీనర్ జగదీష్ చంద్ర పాపన్నపేట జేఏసీ కన్వీనర్ దేవయ్య. టి పి టి ఎఫ్ జిల్లా పూర్వ అధ్యక్షులు బి ముత్యాలు.సంగయ్య ,టి పి టి ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు యాదగిరి జర్నలిస్టు సంఘ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, బొందుగుల నాగరాజు. శంకర్ దయాల్ చారి, సురేందర్ రెడ్డి, సుధాకర్. సీనియర్ న్యాయవాది ఫజల్ అహ్మద్, . ఉపాధ్యాయ సంఘం బాధ్యులు మల్లారెడ్డి , చల్ల రవీందర్ ప్రజా సంఘాల నాయకులు భీమరి శ్రీనివాస్, గట్టేష్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.


















