Reliance Foundation for telugu states: వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాలకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. ఈ మేరకు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు చైర్పర్సన్ నీతా అంబానీ తరపున ఇరు రాష్ట్రాలకు రూ.40 కోట్ల విరాళం చెక్కును సంస్థ ప్రతినిధులు అందజేశారు. తొలత హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు రూ.20 కోట్ల విరాళం చెక్కును రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. అనంతరం ఏపీలో రూ.20 కోట్లను సీఎం సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చెక్కును సంస్థ ప్రతినిధులు పీఎంఎస్ ప్రసాద్, పీవీఎల్ మాధవరావు సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు.