యువ క్రికెటర్ మానిత్‌కు జగ్గారెడ్డి అండ.. శిక్షణ ఖర్చులు భరిస్తానని హామీ

సంగారెడ్డి, ప్రతిపక్షం, జూన్ 09: జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న యువ క్రికెటర్ నెవిన్ మానిత్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి అభినందించారు. అండర్-17, అండర్-19 జాతీయ టోర్నమెంట్లతో పాటు హెచ్‌సీఏ లీగ్ పోటీల్లో మానిత్ రాణిస్తుండటంపై ప్రశంసలు కురిపించారు.

మానిత్ మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణ, వివిధ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు అయ్యే పూర్తి ఖర్చులను తానే భరిస్తానని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు.

అద్భుతమైన ఆటతీరుతో సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News