పాఠశాల వాహనాలపై రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు.. 60 బస్సులు సీజ్

ప్రతిపక్షం, జూన్ 16: పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై దృష్టి సారించిన రవాణాశాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా నడపడం, సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వంటి ఉల్లంఘనలపై 245 పాఠశాల వాహనాలపై కేసులు నమోదు చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 60 స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకునే లేదా భద్రతా ప్రమాణాలు లేని వాహనాల్లో పిల్లలను పంపవద్దని తల్లిదండ్రులకు రవాణాశాఖ సూచించింది.

Spread the love

Related News

Latest News