బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనపై కీలక సన్నాహక సమావేశం

ప్రతిపక్షం, జూన్ 26: భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణ పర్యటన నేపథ్యంలో నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ ఎంపీ కె. లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పర్యటనకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పనతో పాటు పలు తీర్మానాలపై చర్చించారు.

మూడు రోజుల పాటు కొనసాగే జాతీయ అధ్యక్షుడి పర్యటనను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై పార్టీ నాయకులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సమావేశాలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాలు, ఇతర పార్టీ కార్యక్రమాలపై కార్యాచరణను ఖరారు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Spread the love

Related News

Latest News