ప్రేమ వ్యవహారం విషాదం.. కేపీహెచ్‌బీలో యువకుడి ఆత్మహత్య

ప్రతిపక్షం, జూన్ 27: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్న సతీశ్ కుమార్ (23) అనే యువకుడు హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, ఉద్యోగ శిక్షణ సందర్భంగా పరిచయమైన ఓ యువతితో అతడు ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి మనస్తాపానికి గురైన సతీశ్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News