నటిపై అత్యాచార ఆరోపణలు.. బాలీవుడ్ డైరెక్టర్ షకీల్ నూరానీ అరెస్ట్

ప్రతిపక్షం, ఆగస్టు 09: బాలీవుడ్ దర్శకుడు షకీల్ నూరానీపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ కేసులో 73 ఏళ్ల నూరానీని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని 33 ఏళ్ల నటి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

తన ఫిర్యాదులో నటి తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. కూల్‌డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి ఇచ్చి, ఆ తర్వాత తనకు సంబంధించిన వీడియోలు చిత్రీకరించారని ఆమె ఆరోపించింది. ఆ వీడియోలను చూపిస్తూ బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి నూరానీని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, ఫిర్యాదుదారు వెల్లడించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తన క్లయింట్‌పై వచ్చిన ఆరోపణలను నూరానీ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఆయన పేర్కొన్నారు. కేసులో వాస్తవాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News