హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు

ప్రతిపక్షం, నవంబర్ 08: హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రెండు జోడెద్దుల మాదిరిగా సమన్వయంతో మరింత ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News