పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

  • దుబ్బాకకు 5,500 ఇందిరమ్మ ఇళ్లు అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే:
  • కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజక వర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

ప్రతి పక్షం దుబ్బాక నవంబర్ 08: దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజక వర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను దుబ్బాక పట్టణంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ
ప్రతి పేదవాడి జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక గొప్ప కల. ఆ కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి ఇప్పటివరకు 5,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం సాధారణ విషయం కాదన్నారు. పేదల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు.

ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజుఅని, ఒకవైపు దీపావళి పండుగ, మరోవైపు పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.పేద ప్రజలకు అన్ని రంగాల్లో న్యాయం జరగాలంటే, ప్రజా సంక్షేమం మరింత ముందుకు సాగాలంటే రేవంత్ రెడ్డి లాంటి ప్రజా నాయకుడు మరో 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని దుబ్బాక నియోజకవర్గ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున ఆకాంక్షిస్తున్నాం అన్నారు.ఈ మూడేళ్ల ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యం ద్వారా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం పంపిణీ, ఏకకాలంలో రైతు రుణమాఫీ, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గత ప్రభుత్వాల ఆర్థిక విధ్వంసం కారణంగా అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారు అని తెలిపారు.మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల ఆశీస్సులతో వారు మరో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరీ రవి, పి ఏ సి ఎస్ డైరెక్టర్ కాల్వ నరేష్, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాసు, పట్టణ అధ్యక్షుడు మల్లుగారి చంద్రారెడ్డి, ఏ ఎం సి మాజీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్ ,దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Latest News