సీఎం రేవంత్ రెడ్డితోనే తెలంగాణ అభివృద్ధి

కాంగ్రెస్ పార్టీ కొమురవెల్లి మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్.

ప్రతిపక్షం, కొమురవెల్లి, నవంబర్ 08: సీఎం రేవంత్ రెడ్డితోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ కొమురవెల్లి మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కొమురవెల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్బంగా శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పోలీసుబొమ్మ చౌరస్తాలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సదుపాయం వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, పేద కుటుంబాల అభ్యున్నతి, విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు, గ్రామ, మండల ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News

Latest News