Trending Now

Kangana: కంగనా రనౌత్‌పై రాబర్ట్ వాద్రా ఘాటు వ్యాఖ్యలు

ప్రముఖ సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల నిరసనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్‌కు పార్లమెంటులో కొనసాగే అర్హత లేదని అన్నారు. ‘కంగనా చదువుకోలేదు. ఆమె ప్రజల గురించి, రైతుల గురించి ఆలోచించదని నేను అనుకుంటున్నాను. ఆమె తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది.’ అన్నారు.
కాగా.. కంగనా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రైతుల ఉద్యమంలో సుదీర్ఘ ప్రణాళిక ఉందని అన్నారు. ఈ సమయంలో బంగ్లాదేశ్ వంటి పరిస్థితి భారతదేశంలో తలెత్తి ఉండేది. కానీ దేశం బలమైన నాయకత్వం కారణంగా అది జరగలేదు. ఇక ఇక్కడి రైతు ఉద్యమం కుట్రపూరితంగా జరిగింది. నిరసనల్లో పాల్గొన్నవారిలో రైతులే లేరని అన్నారు. కంగనా చేసిన ఈ ప్రకటనపై పెద్ద దుమారమే రేగింది. కంగనా చేసిన ఈ వ్యాఖ్యపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష ఎంపీలు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Spread the love

Related News

Latest News