ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 10: మూడవసారి భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారంతోపాటు రాష్ట్రానికి రెండు కేంద్రం మంత్రి పదవులు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నిర్మల్ బిజెపి శ్రేణులు పట్టణంలోని ఇందిరానగర్ లో ఉన్న బిజెపి ప్రాంతీయ కార్యాలయం ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు సీట్లు పంచుకుంటూ టపాసులు పెంచి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. బిజెపి ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య మాట్లాడుతూ పదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం సమసంక్షేమం జరిగిందని చెప్పారు. మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం దేశ ప్రజలకే కాకుండా ప్రపంచానికిగర్వకారణం అని చెప్పారు.
ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీల వారికి న్యాయం చేసే దిశగా గతంలో ఎన్నడలేని విధంగా 68 మంత్రి పదవులు మోడీ మూడవ క్యాబినెట్ లో కల్పించడం మహోన్నతమైన అవకాశం గా గుర్తించాలన్నారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఇండియా కూటమి దశలవారీగా నేరవేర్చే దిశగా భవిష్యత్తు కార్య చలన ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళుతుందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిససెమ్మ రాజు , కొరిపల్లి శ్రావణ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గాదే విలాస్ , ఒడిసెల శ్రీనివాస్ , అయ్యన్న గారి రాజేందర్ ,రామోజీ నరేష్ ,అల్లం భాస్కర్, సీనియర్ నాయకులు సుధాకర్, కత్తి సుధాకర్ ,బట్టు సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.