బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జోన్ 18: మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం 5 గంటలకు ఎలాంటి కారణం చెప్పకుండా అరెస్ట్ చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారని కారణాలు అడుగుతే తెలపడం లేదు అని మెదక్ పట్టణ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు తెలిపారు. అరెస్టును ఆయన ఖండించారు. అరెస్ట్ అయినవారిలో మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, దీపక్ కుమార్, జుబేర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, మాయ మల్లేశం, సాయి, కృష్ణాగౌడ్, ఇంద్నాన్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News