Former CM Jagan criticizes Chandrababu: చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న వైసీసీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ‘చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావ్. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. మీ నాయకులకు ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో ఉంటారు. రెడ్‌బుక్ పెట్టుకోవడం ఏదో ఘనకార్యం కాదు. పాలన గాలికొదిలేసి రెడ్‌బుక్‌పైనే బాబు దృష్టి పెట్టాడు. ప్రజా సమస్యలపై దృష్టి లేదు.’ అంటూ దుయ్యబట్టారు.