NTR’s comments are a hot topic in the industry.. Do you know who ‘Hari’ is?: ‘దేవర’ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘ఎవరేం అన్నా, ఎవరేం అనుకున్నా సరే ఎన్టీయార్ ఆర్ట్స్‌కు మూలస్తంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకు స్ట్రెంత్ హరి.. నచ్చిన వాళ్లు జీర్ణించుకుంటారు. లేదంటే లేదు…’ అని ఎన్టీఆర్ అన్నారు. దీంతో హరి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ‘హరి’ ఎవరంటూ అందరూ తెగ వెతికేస్తున్నారు. ఈ హరి ఎవరో కాదు, కళ్యాణ్ రామ్ భార్యకు తమ్ముడు. అన్నదమ్ములిద్దరి సినిమా వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు. అయితే, హరి వచ్చాకే ఫ్యాన్స్‌కు, తారక్‌కు మధ్య గ్యాప్ వచ్చిందన్న రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్‌కి ఎన్టీఆర్ ఇప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.