హిట్లర్‌ స్ఫూర్తిగా ‘హైడ్రా’ పేరు పెట్టాం: రేవంత్

ప్రతిపక్షం, జూన్ 06: హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థకు ‘హైడ్రా’ అనే పేరు పెట్టడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘హైడ్రా’ అనే పదం చారిత్రక నేపథ్యం ఉన్న పేరని, దానిని స్ఫూర్తిగా తీసుకుని సంస్థకు ఆ పేరు పెట్టామని వివరించారు. అక్రమ ఆక్రమణలు, చెరువులు, జలాశయాల పరిరక్షణలో ఈ సంస్థ కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశం ఇవ్వడానికే ఈ పేరు ఎంపిక చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ఎవరూ సాహసించకుండా ఉండాలనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Spread the love

Related News

Latest News