ప్రతిపక్షం, ఆగస్టు 08: తమిళనాడు సీఎం, నటుడు విజయ్–సంగీత దంపతుల విడాకుల వ్యవహారంపై కొత్త చర్చ మొదలైంది. సంగీత విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు వార్తలు రావడంతో విజయ్, సంగీత మళ్లీ ఒక్కటయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో గతంలో విజయ్‌తో త్రిషకు ఉన్నట్లు వచ్చిన డేటింగ్ రూమర్లు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
అయితే విజయ్, త్రిష తమ మధ్య ఉన్న సంబంధంపై ఎప్పుడూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇద్దరూ సన్నిహితంగా కనిపించిన సందర్భాలను ఆధారంగా చేసుకుని మాత్రమే గతంలో పలు రకాల ఊహాగానాలు వచ్చాయి. తమది స్నేహపూర్వక బంధమేనని అభిమానుల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా విజయ్–సంగీత విషయంలో వచ్చిన పరిణామాలతో ఈ రూమర్లపై మరోసారి చర్చ మొదలైంది. అయితే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అధికారికంగా ధృవీకరించని విషయాలను నమ్మడం సరికాదని పలువురు సూచిస్తున్నారు. విజయ్–సంగీత బంధం విషయంలో అసలు పరిణామాలు ఏమిటన్నది అధికారిక సమాచారం వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

















