కామరాం తండా మాజీ సర్పంచ్ రాములు నాయక్ వదిన మృతి పట్ల సంతాపం
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 09: శంకరంపేట మండలం కామరాం తండా మాజీ సర్పంచ్ రాములు నాయక్ వదిన హలావత్ రంకి ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి స్పందించి, మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని నాయకుల ద్వారా అందజేశారు.
ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో హలావత్ వినోద్ నాయక్, మాజీ సర్పంచ్ రాములు నాయక్, మాజీ ఎంపీటీసీ మున్య నాయక్, హలావత్ కిషన్ నాయక్, సేనాపతి నాయక్, మోహన్, శంకర్, దేవుల నాను, చంద్రశేఖర్, రాజు, ఉమ్లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.





























