ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపికైనా (జోన్ – I నుండి – 5 గురు) జోన్ – II నుండి – 12 మంది) 17 మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారులపై ఉక్కు పాదంతో అణిచివేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. నూతనంగా ఎంపికైన 17 మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు శాఖ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టిందన్నారు. ఎంతో బాధ్యతగా సమాజ హితం కోసం ఉద్యోగ విధులను నిర్వహించాలని నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, డైరెక్టర్ జనరల్ (ఇంచార్జి) R V కర్ణన్, జాయింట్ డైరెక్టర్ రామ్ దాన్ లు పాల్గొన్నారు.