బీఎల్ఎఫ్ రాష్ట్ర నేతపై కేసు నమోదు
ప్రతిపక్షం, ప్రతినిధి నిజామాబాద్, జూన్ 28 : వ్యభిచారం కేసులో బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్)రాష్ట్ర నాయకుడు ఒకరు పట్టుబడ్డారు. నిజామాబాద్ నగరం సుభాష్ నగర్లోని వ్యభిచార గృహంపై గురువారం రాత్రి మూడో టౌన్ పోలీసులు రైడ్ చేశారు. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలితో పాటు ఇద్దరు మహిళలు బీఎల్ఎఫ్ నాయకుడు పట్టుబడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు మూడవ టౌన్ ఎస్సై ప్రవీణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కార్మిక సంఘాల నాయకుడి ముసుగులో ఉన్న సదరు నాయకుడి రాసలీలల వ్యవహారం బట్టబయలు కావటంతో నిజామాబాద్ కార్మిక లోకం నివ్వరపోయింది.