బిగ్‌బాస్-10 కంటెస్టెంట్లు వీరేనా?

ప్రతిపక్షం, జూన్ 09: తెలుగు బిగ్‌బాస్-10 సీజన్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి షోను ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త రూల్స్, విభిన్న టాస్కులు, వినూత్న ఫార్మాట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ సీజన్‌లో పాల్గొననున్న కంటెస్టెంట్లుగా పల్లవి గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేశ్, పండు మాస్టర్, జ్యోతి, రాయల్ మెక్ రమణ, నందూస్ వరల్డ్ నందూ, చంద్రహాస్, తేజస్విని గౌడ, శివ్ కుమార్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ జాబితాపై ఇప్పటివరకు నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ పేర్లను కేవలం ప్రచారంగానే పరిగణించాల్సి ఉంటుంది.

Spread the love

Related News

Latest News