నల్గొండ పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు హత్య – కలకలం.

*గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానం – భర్తపై పోలీసుల విచారణ.

ప్రతి పక్షం నల్గొండ నవంబర్ 10: నల్గొండ పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు మెహబూబ్ బీ హత్య కలకలం రేపింది.ప్రాథమిక సమాచారం ప్రకారం గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతురాలు, ఆమె భర్త కులాంతర వివాహం చేసుకున్నట్లు, వారి మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం.ఘటనా స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Latest News