హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సన్నాహక సమావేశం

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం, నవంబర్ 10: కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పెట్టెం నవీన్ , వైస్ చైర్మన్ అనురాగ్ దాసరపు , మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి వైస్ చైర్మన్ చిత్తారి పద్మ , ఏడు మండలాల అధ్యక్షులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , సోషల్ మీడియా వారియర్ లు ,ఇతర ముఖ్య నాయకులు

మంత్రి పొన్నం ప్రభాకర్

వైద్యరంగంలో స్పెషలైజేషన్ ప్రాధాన్యత పెరిగినట్లే, రాజకీయాలలో సోషల్ మీడియా కళ్లు, చెవులుగా మారి అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.సోషల్ మీడియాలో అసత్యాలను తిప్పికొడుతూ క్షేత్రస్థాయిలో వచ్చిన మార్పులను, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది.సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ముఖ్యంగా రుణమాఫీ లబ్ధిదారులతో స్వయంగా వీడియోలు తీయించి ప్రచారం చేయాలి.

నియోజకవర్గంలోని దివ్యాంగులు, వృద్ధులకు అలింకో ద్వారా చేతికర్రలు, బ్యాటరీ రిక్షాలు, కృత్రిమ కాళ్లు/చేతులు, వినికిడి పరికరాలు వంటి సహాయ పరికరాలు ఉచితంగా అందజేసే కార్యక్రమం చేపట్టాం.నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వందలాది కంపెనీలతో జనవరి నెలలో భారీ ఎత్తున జాబ్ మేళా నిర్వహిస్తున్నాం..

గ్రామీణ యువత కోసం ప్రతి గ్రామానికి రూ. 1 లక్ష (పెద్ద గ్రామాలకు రూ. 2 లక్షలు) నిధులతో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసేందుకు కార్యచరణ తీసుకున్నాం..అన్ని గ్రామాల్లో తాగునీటి ఫిల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు ప్రత్యామ్నాయ వస్తువులు, హోటళ్లకు స్టీల్ గ్లాసులు పంపిణీ చేశాం..

కబడ్డీ అకాడమీ, స్విమ్మింగ్ పూల్ నిర్మాణంతో పాటు కళలు, నృత్యం వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణకు సౌకర్యాలు కల్పిస్తున్నాం..ఇందిరమ్మ ఇళ్లు లేదా ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేకుండా కేవలం అర్హత ఉన్న పేదలకే న్యాయం జరిగేలా చూడాలి.కాంగ్రెస్ పార్టీ వారియర్లు గా ప్రభుత్యం చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి గడప గడప కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే..

Related News

Latest News