ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలిడిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమ్మె నోటీసు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 10: ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, రూ.50 లక్షల ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్‌కు సమ్మె నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి కే. నర్సమ్మ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు గత 20 ఏళ్లుగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించకుండా పారితోషికాలతోనే సరిపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత పని చేసినా ఆశా వర్కర్లు మరణిస్తే కనీసం అంత్యక్రియల ఖర్చులు కూడా అందడం లేదని అన్నారు.

2023లో ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం విచారకరమన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆశా వర్కర్ల సమస్యల సాధన కమిటీ నాయకత్వంతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో డిసెంబర్ 15, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి సావిత్రి, జిల్లా నాయకులు రాణి, పెంటమ్మ, స్వప్న, సుజాత, సావిత్రి, దేవమ్మ, లక్ష్మి, కవిత, మంజుల, పుష్ప, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News