-కొమురవెల్లి మండల కేంద్రంలో నివాళులు అర్పించిన తహసిల్దార్ జి,దివ్య
ప్రతిపక్షం, కొమురవెల్లి, నవంబర్ 10: ప్రజాకవి అందెశ్రీ తెలంగాణ సాహితి సమాజానికి దిక్సూచియని కొమురవెల్లి తహసిల్దార్ జి,దివ్య అన్నారు. సోమవారం కొమురవెల్లి మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయంలో డాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి వేడుకలు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా ముందుగా అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా తహసిల్దార్ జి. దివ్య మాట్లాడుతూ అక్షరానికి ఆత్మను పాటకు ప్రజా చైతన్యాన్ని జోడించి తెలంగాణ అస్థిత్వానికి తన కలముతో ప్రాణం పోసిన మహాకవి అని, తెలంగాణ సమాజానికి నేటి కవులకు కళాకారులకు దిక్సూచి అని అన్నారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారధి కవి గాయకుడు పిన్నింటి రత్నం మాట్లాడుతూ తన జీవితాన్ని కష్టాల కడలి నుండి కవిగా మారి ఎన్నో పాటలు రాసి ఉద్యమ సాహితీ శిఖరంగా ఎదిగారని, తెలంగాణ భాషను యాసను ఘోషను తన కలం గలం ద్వారా సమాజ హితం కోసం శ్రమించి పరితపించిన ప్రజాకవి అని, ఆయన నేటి కవులకు కళాకారులకు మార్గ నిర్దేశకుడని అన్నారు. ఈకార్యక్రమంలో డిటి రాజేశం, గిర్దవర్ జీ,నరసింహులు, అన్ని గ్రామాల జిపిఓలు మరియు కార్యాలయ సిబ్బంది, ప్రముఖ కళాకారుడు పిన్నింటి సాయిలు పాల్గొన్నారు.






























