ఆరేండ్ల బాలికపై యువకుడి ఆఘాయిత్నం..
ప్రతిపక్షం, ప్రతినిధి నిజామాబాద్, మే 27: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. అదే సమయంలో బాలిక చిన్నమ్మ చూడడంతో బాలికను వదిలి యువకుడు పరారీ కావడంతో బాలికకు ముప్పు తప్పింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. మోపాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికకు చాక్లెట్ ను ఆశగా చూపి తన ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలికను ఇంట్లోకి తీసుకువెళ్తున్నప్పుడు చూసిన బాలిక చిన్నమ్మ అక్కడికి చేరుకొని కేకలు వేయడంతో యువకుడు బాలికను వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఈ విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆ యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. అనంతరం మోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సదరు యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.