‘హైడ్రా’ కూల్చివేతలపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న తాను మాత్రం ‘తగ్గేదేలే’ అంటూ ముందుకు సాగిపోతోంది. అక్రమ నిర్మాణాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ.. వాటిని పూర్తిగా నేలమట్టం చేస్తోంది. తాజాగా హైదరాబాద్లోని అడిక్మెట్ డివిజన్ రాంనగర్లో ‘హైడ్రా’ కూల్చివేతలు చేపట్టింది. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఇవి అక్రమమని తేలడంతో అధికారులు ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభించారు.