రేవంత్ ‘టీజీ రైజింగ్-2047’కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆదిలాబాద్‌లో భారీ పారిశ్రామిక కారిడార్

ప్రతిపక్షం, జూన్ 09: తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపొందించిన ‘టీజీ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్‌లోని కీలక ప్రతిపాదనలకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపినట్లు సమాచారం.

ఇప్పటికే ఆదిలాబాద్‌లో 1,980 ఎకరాల్లో 9 వేల అడుగుల రన్‌వేతో రక్షణ, పౌర విమానయాన అవసరాలకు ఉపయోగపడే విమాన కేంద్రాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ.310 కోట్ల నిధులను కూడా మంజూరు చేసినట్లు వెల్లడైంది.

పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో ఆదిలాబాద్ ప్రాంతం తయారీ పరిశ్రమలు, గిడ్డంగులు, రవాణా సేవలకు ప్రధాన కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు లభించనుంది.

Spread the love

Related News

Latest News