భక్తి పారవశ్యంలో గణనాథుడి శోభాయాత్ర..

భక్తులతో కలిసి సందడి చేసిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి.. ప్రత్యేక పూజలు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 25: గణపతి నామస్మరణలు.. భక్తుల జయజయధ్వానాలు.. మంగళవాయిద్యాల హోరుతో హవేలిఘనపూర్‌ మండల కేంద్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. గణనాథుడి శోభాయాత్రలు వైభవంగా సాగుతుండగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి భగత్‌సింగ్‌ గణేష్‌ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గణేష్‌ మండలి సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామస్తులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. భక్తులతో మమేకమై ఉత్సవాల్లో సందడి చేశారు. గణపతి నామస్మరణలు, భక్తుల కోలాహలంతో మండల కేంద్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించిన గ్రామస్తులు, గణేష్‌ మండలి సభ్యులను అభినందించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి కృపతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తికి ప్రతీకగా నిలవడంతో పాటు ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ఐక్యతా వేదికలుగా నిలుస్తున్నాయని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవడం మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో హవేలిఘనపూర్‌ మండలంలోని ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో అభివృద్ధి, ప్రతి గ్రామంలో సోదరభావం వెల్లివిరియాలని కోరుకున్నారు.అనంతరం హవేలిఘనపూర్‌ సర్పంచ్‌ మేకల సాయిలు, ఉపసర్పంచ్‌ వడ్ల రాజు, గణేష్‌ మండలి సభ్యులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాణిక్యరెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, నరేందర్‌రెడ్డి, దొమ్మాట రవి, సత్యంగౌడ్‌, మన్నె శ్రీనివాస్‌, మన్నె శంకర్‌, కుర్మ పోచయ్య, పోచేందర్‌, నవీన్‌, మంద శ్రీహరి, నర్సింలు, స్వామినాయక్‌, గణేష్‌ మండలి సభ్యులు, భక్తులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News