సీఎం సహాయనిధి పథకం పేద ప్రజలకు వరం

*సిపిఐ చండూరు మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 25, చండూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని సిపిఐ చండూరు మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్, మున్సిపాలిటీ నాలుగో వార్డు కౌన్సిలర్ జెల్ల ధనమ్మ శ్రీనివాసులు అన్నారు.సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సహకారంతో మున్సిపాలిటీకి చెందిన నలపరాజు పుష్పలతకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడే ప్రతి ఒక్కరు సీఎం సహాయనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు దోటి వెంకన్న, జెల్ల శ్రీను, అందరిక పరమేశ, ఇరిగి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News