ప్రతిపక్షం, నవంబర్ 10: నేతాజీ నగర్లో ఈ నెల 15న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ పార్టీ నాయకుడు గుర్ల తిరుమలేష్ ఆహ్వానించారు. ఈ మేరకు కేటీఆర్‌ను కలిసి కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన కేటీఆర్, పడిపూజ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని గుర్ల తిరుమలేష్‌కు తెలిపినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
నేతాజీ నగర్‌లోని గుల్మోహర్ పార్క్‌లో ఈ నెల 15న అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు గుర్ల తిరుమలేష్ తెలిపారు. అయ్యప్ప స్వామి భక్తులు, స్థానికులు పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కేటీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన సందర్భంగా వాకిటి శంకర్, వడ్డే శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.





























