Trending Now

ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ  కొత్త రికార్డు..

ప్రతిపక్షం, హైదరాబాద్, ఏప్రిల్1: ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) గత ఏడాది గణాంకాలను అధిగమించి అద్భుతమైన వసూళ్లను సాధించిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ. 257 కోట్లకు పైగా ఆస్తిపన్ను అదనంగా వసూలైందన్నారు. 2023-2024 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాల మేరకు రూ.1810 కోట్లు కాగా, ఇప్పటివరకు 1917 కోట్ల రూపాయల పన్ను వసూలైందన్నారు. గత సంవత్సరం 2022-2023 లో ఆస్తి పన్ను సేకరణ రూ. 1660 కోట్లతో పోలిస్తే 15.5 శాతం పెరిగిందన్నారు.

2022-23 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిలపై వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకం అమలు ద్వారా ఆస్తి పన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ ని ప్రారంభించడంతో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. పన్ను చెల్లింపుదారులను  ప్రోత్సహించడంతో ఈ ఏడాది దాదాపు రూ.300 కోట్ల పన్ను వసూళ్లు జరిగిందని తెలిపారు. చివరి రోజున 123 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు నమోదు అయిందని తెలిపారు. బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్‌స్పెక్టర్లు పలువురు బిఎల్‌ఓలు, బిఎల్‌ఓ సూపర్‌వైజర్ల వంటి కీలకమైన ఎన్నికల విధులు నిర్వహిస్తున్నప్పటికీ లక్ష్యాన్ని అధిగమించామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిల వసూళ్లు సమిష్టి కృషితో సులభతరమైందని అన్నారు. బిల్ కలెక్టర్ లు, టాక్స్ ఇన్ స్పెక్టర్ లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల సహకారం, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర పన్నుల విభాగం, ఐటి, ఆర్థిక విభాగాలు కీలకమైన పాత్ర పోషించాయని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News