ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11 : జిల్లా పరిషత్ లకు సముచిత స్థానమిచ్చి తగిన నిధులను వెంటనే మంజూరు చేయాలని, గ్రామ పంచాయతీలను పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసిన నిధులు కేటాయించాలని కోరుతూ నిర్మల్ జిల్లా జడ్పీటీసీ లో ఫోరం అధ్యక్షులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ను కలిసి వినతి పత్రం అందజేశారు. జడ్పీలకు తగిన నిధులు లేకపోవడంతో మండల గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులన్నీ కుంటుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు గౌరవ వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో గ్రామపంచాయతీలు ఉన్నాయని, వీటన్నింటిని క్షేత్రస్థాయిలో గుర్తించి జడ్పీలకు, గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు అయేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాలలో లక్షల రూపాయలు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని ఈ బిల్లుల మంజూరు కి కూడా తమవంతుగా కృషిచేసి సహకరించాలని కోరారు ఈ సందర్భంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. సానుకూలంగా స్పందించిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య విధుల కేటాయింపు పెండింగ్ విల్లుల విషయమై పరిపూర్ణమైన రీతిలో అవగాహన చేసుకుని వెంటనే నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని భరోసా కల్పించారు. ఆయన వెంట పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.