Balapur Ganesha Laddu at a record price: తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ మహాగణపతి తరువాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడు. ప్రతీయేటా ఇక్కడ లడ్డూ ధర రికార్డు స్థాయి ధర పలుకుతుంది. బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఇక్కడి లడ్డూను దక్కించుకుంటే సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక, ఈ ఏడాది రూ.30,01,000లకు సింగిల్ విండో ఛైర్మన్ కొలను శంకర్ రెడ్డి చేజిక్కించుకున్నారు. ఇక, గత ఏడాది బాలాపూర్ లడ్డూ ధర రూ. 27లక్షలకు దయానంద రెడ్డి దక్కించుకున్న విషయం తెలిసిందే. కొనసాగుతోంది. కాగా.. 1994 నుంచి బాలాపూర్లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది.