నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

  • సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం, కరీంనగర్, సెప్టెంబర్ 24: ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తదితర అధికారులకు పలు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ను పరిశీలించారు. నూతన కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రాంగణం, జిల్లా కలెక్టర్ ఛాంబర్‌తో పాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం నూతన భవనంలో అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్ తదితర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News