Trending Now

బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కల్గుతుంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐ అప్పగించండి అని బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కల్గుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మిత్ర పక్షం అయిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కాపాడేందుకే.. సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎలా బీజేపీ కి కొమ్ముకాసిందో చూశామన్నారు. అందుకు ప్రతిఫలంగా కేసీఆర్‌ను కాపాడాలని బీజేపీ చూస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలు పాలనలో కాళేశ్వరం మీద కేంద్ర బృందాలతో నివేదికలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం మీద జ్యుడీషియల్ కమిటీ వేసి.. విచారణకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

ఈడీ, ఐటీ, సీబీఐ లతో కేసులు పెట్టి.. వేధించి.. పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్‌లో నుంచి కాపాడటం ఎవరి తరం కాదు. బీఎల్ సంతోష్‌ను ఎమ్మెల్యే లా కొనుగోలు కుట్రలో ఇరికించారు అని చెబుతున్నారు.. కదా ఎందుకు నిరూపించలేక పోయారు.. బీజేపీ చిత్తశుద్ధి అర్ధం అవుతుందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చుకున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ డ్రామాలు ఇప్పటికైనా అపాలని ఆయన పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News