Narendra Modi: ఈ నెల 14న జమ్ములో ప్రధాని మోదీ పర్యటన

PM Narendra Modi Visits Jammu: ప్రధాని నరేంద్రమోదీ జమ్ము కశ్మీర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 14న ఆయన జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ ప్రచారంలో భాగంగా మోదీ పలు సభల్లో పాల్గొననున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. కాగా.. 2019లో ఆర్టికల్‌ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో జమ్ము కశ్మీరులో ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Related News

Latest News