AP Floods: ఏపీ వరద బాధితులకు గౌతమ్ అదానీ రూ. 25 కోట్ల విరాళం

Gautam Adani donates Rs. 25 crore donation: ఇటీవల భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా వ్యాపారవేత్తలు సైతం ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి తమ వంతు విరాళం అందిస్తున్నారు. వరదలతో అల్లాడిన ఏపీకి సాయం చేసేందుకు తాజాగా అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అదానీ ఫౌండేషన్ తరుఫున రూ. 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సంబంధిత పత్రాలను సంస్థ ఎండీ కిరణ్ అదానీ సీఎం చంద్రబాబుకు అందిస్తోన్న ఫోటోను షేర్ చేశారు.

Related News

Latest News