నిజామాబాదులో కాంగ్రెస్ ధర్నా

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్ సెప్టెంబర్ 28: ఓట్ల చోరీ వ్యవహారం లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న వ్యవస్థ వ్యతిరేక నిర్ణయాలు నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో
సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో ధర్నా నిర్వహించారు.ఓట్ల చోరీకి పాల్పడుతున్న జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలనీ కోరుతూ నిరసన తెలిపారు. జ్ఞానేశ్ కుమార్ మోడీ ప్రభుత్వంతో కుమ్మకు అయి ఫామ్ 6ను మార్చేశారని అన్నారు. తెలంగాణ లో 72 లక్షల ఓట్లను తొలగించారని నాయకులు విమర్శించారు.
అంతకు ముందు స్థానిక రైల్వే స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకులు జ్ఞానేష్ కుమార్ దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్ దాన్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశ వేణు, పార్టీ సీనియర్ నాయకులు ఈరవత్రి అనిల్, మాజీ మేయర్ డీ సంజయ్, రత్నాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News