ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 28: మెదక్ జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్ సంబంధించిన దుకాణంల సముదాయల యొక్క కిరాయి డబ్బులు గత 10 సంవత్సరముఖ నుండి దుర్వినియోగం చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కనుగు రాజశేఖర్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నేను గుల్షన్ క్లబ్ నందు మెంబర్ గా ఉన్నాను. ఇట్టి క్లబ్ గత పది సంవత్సరాలుగా, క్లబ్బు బాధ్యతలు నిర్వహిస్తున్న వారు సరిగా మెయింటెనెన్స్ చేయడం లేదు ఇట్టి విషయంలో గతంలో ఉన్న ఆర్డీవో ఆరుగురిని తో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దుర్వినియోగమైన డబ్బుల విషయంలో లెక్కలు చూసి ఒక నెలలో ఇవ్వాలని ఆర్డీవో వారికి ఆదేశించింది. కమిటీ సభ్యులు ఎలాంటి రిపోర్టు సబ్మిట్ చేయకుండా గత ఆరు సంవత్సరాలుగా వారి ఇష్టారాజ్యముగా క్లబ్ నిర్వహణ చేస్తున్నారు. ఆరుగురు కమిటీలో ఉన్న ఇద్దరు చనిపోవుగా నలుగురు వ్యక్తులు క్లబ్ నడిపిస్తున్నారు. నలుగురు వ్యక్తులలో ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం క్లబ్ కు రాకుండా దూరంగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు.
క్లబ్ కు సంబంధించిన 72 దుకాణముల కిరాయిని వసూలు చేసుకుని క్లబ్ డెవలప్మెంట్ చేయకుండా వారు వారి సొంతానికి లక్షల రూపాయలు వాడుకుంటున్నారు క్లబ్ సభ్యులు 343 మంది ఉన్న ఇందులో కొంతమంది క్లబ్ సభ్యులు చనిపోగా మిగతావారు ఉన్నారు కొత్తగా సభ్యత్వం నమోదు చేసుకొనుటకుగాను వీరు ఇరువురు ఒక్కొక్క సభ్యుని వద్ద 20,000/-రూపాయలు తీసుకొనుచున్నారు క్లబ్బు మెయింటెనెన్స్ గురించి. కరెంట్ బిల్లు మున్సిపల్ బిల్లు కట్టుచున్నారు మిగతా ఎలాంటి డెవలప్మెంట్ చేయడం లేదని ఆయన ఆరోపించారు. క్లబ్బుకు నెలకు లక్ష రూపాయల పైన వసూలు చేస్తున్నారు. స్వాగత్ హోటల్ యజమాని క్లబ్బు ఇద్దరు వ్యక్తులకు కొంత డబ్బు ఇచ్చి వారి దుకాణంలో వెనుక కొంత స్థలములు ఆక్రమించుకొని అక్రమంగా కట్టుకున్నాడు ఇట్టి విషయంలో క్లబ్బు సభ్యులతో ఎలాంటి మీటింగ్ గాని ఏర్పాటు చేయకుండా వారు ఇరువురు హోటల్ యజమాని నుండి లక్షల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు.
బావాచి హోటల్ యజమాని క్లబ్బులో గేటు పక్కన అక్రమంగా బోరు వేసి బోర్ నుండి అతని హోటల్ వరకు పైపులైన్ వేసి నీళ్లు వాడుకుంటున్నారు. దుకాణంల యొక్క అగ్రిమెంటు పీరియడు అయిపోయిన తర్వాత కూడా రీ అగ్రిమెంట్ చేయించుకోకుండా పాత కిరాయి మీదనే వారు కంటిన్యూ అవుతున్నారు. మొదటి ఫ్లోర్లో చాలామంది కిరాయికి ఉన్నారు. అందులో ఒకరు ఇల్లుగా మార్చుకొని బాత్రూం కట్టుకొని వెనుక భాగంలో సెప్టిక్ ట్యాంక్ కట్టినారు ఈ రెండు నెలల నుండి కూడా ఎంక్వయిరీ జరుగుతున్న సిక్స్ మెన్ కమిటీ లో ఉన్న ఇద్దరు కిరాయిలు వసూలు చేయుచున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని క్లబ్బును కాపాడవలసిందిగా వారు కలెక్టర్ ను వేడుకున్నారు





























