మెదక్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా.. దిష్టిబొమ్మ దగ్ధం
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, సెప్టెంబర్ 28: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.నిరసనలో భాగంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా సార్ ప్రక్రియలో భాగంగా 13 కోట్ల ఓట్లను రద్దు చేయడం జరిగిందని ఓటర్లకు మరో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో.మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావుల రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గంగాధర్ మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్. వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ తో పాటు నర్సాపూర్ రామాయంపేట. మున్సిపల్ చైర్మన్ లు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





























