త్వరలో రెండు డెడ్‌బాడీ ఫ్రీజర్లు, రెండు వైకుంఠ రథం

ప్రతిపక్షం వార్తకు స్పందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు ఎమ్మెల్యే సహకారంతో త్వరలో పరిష్కారం

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, సెప్టెంబర్ 28: మెదక్ జిల్లా కేంద్రంలో డెడ్‌బాడీ ఫ్రీజర్ల కొరతపై సోమవారం ప్రతిపక్షం లో ప్రచురితమైన వార్తకు మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం ప్రతినిధితో మాట్లాడుతూ ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో రెండు డెడ్‌బాడీ ఫ్రీజర్లు ఉండగా, వాటిలో ఒకటి పనిచేయడం లేదని, మరొకటి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఉందని తెలిపారు.ప్రజలకు అవసరమైన సమయంలో డెడ్‌బాడీ ఫ్రీజర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చైర్‌పర్సన్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో పట్టణంలో త్వరలో రెండు డెడ్‌బాడీ ఫ్రీజర్లు, రెండు వైకుంఠ రథం అందుబాటులోకి తీసుకురావడానికి. 70 లక్షల రూపాయలతో మంజూరు జరిగినట్లు తెలిపారు. దీంతో సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆమె వెల్లడించారు.

“డెడ్‌బాడీ ఫ్రీజర్లు దొరకవు… పైరవీ చేస్తేనే దొరుకుతాయా?” అంటూ వచ్చిన వార్తపై స్పందించిన ఆమె, మున్సిపాలిటీ ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.డెడ్‌బాడీ ఫ్రీజర్లను మున్సిపల్ కార్యాలయం నుంచి తీసుకెళ్లే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, తిరిగి అప్పగించే సమయంలో కూడా అదే విధంగా జాగ్రత్తగా అప్పగించాలని ప్రజలకు సూచించారు. ఫ్రీజర్లను సురక్షితంగా వినియోగిస్తే ఎక్కువకాలం నాణ్యతగా ఉంటాయని తెలిపారు.ప్రస్తుతం డెడ్‌బాడీ ఫ్రీజర్లను మున్సిపల్ కార్యాలయం వెలుపల ఉంచుతున్నామని, వాటి రక్షణ కోసం మున్సిపల్ ప్రాంగణంలో షెడ్ నిర్మాణం చేపట్టనున్నట్లు రాధిక భూపతిరాజు తెలిపారు. షెడ్ నిర్మాణం పూర్తయిన అనంతరం వాటిని మరింత భద్రంగా పరిరక్షించవచ్చని అన్నారు.
అదేవిధంగా, ఎవరైనా దాతలు డెడ్‌బాడీ ఫ్రీజర్‌ను విరాళంగా అందజేస్తే, వారి పేరుతో మున్సిపల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చైర్‌పర్సన్ తెలిపారు. ప్రజల అవసరాలకు సంబంధించిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News