మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

•ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం

•డీఎంహెచ్ఓ.డాక్టర్ భాస్కర్ నాయక్

వనపర్తి ప్రతినిధి, ప్రతిపక్షం, సెప్టెంబర్ 28: యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా,తమ భవిష్యత్తును లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని డీఎంహెచ్ఓ.డాక్టర్ భాస్కర్ నాయక్ సూచించారు. నషా ముక్త యువ – వికసిత్ భారత్” కార్యక్రమంలో భాగంగా సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా…మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక మరియు ఆర్థిక నష్టాలను వివరించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.మత్తు పదార్థ రహిత భారత్‌ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

అనంతరం విద్యార్థినీ విద్యార్థులతో “మత్తు పదార్థాలను స్వీకరించము – వాటికి దూరంగా ఉంటాము” అనే ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ద్వారా “మత్తుకు దూరం – భవిష్యత్తుకు బాట”, “యువతే దేశ భవిష్యత్తు – మత్తుకు నో చెప్పండి” వంటి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రామ్ అధికారి.డాక్టర్ మారుతి నందన్ గౌడ్,జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, నరేంద్ర కుమార్,ఆరోగ్య విస్తరణ అధికారి.నర్సింగరావు, జిల్లా ఎన్‌సీడీ టీం సభ్యులు శ్రీనివాస్ కొండ, అశోక్ కుమార్, మధుమోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News