గ్రామాభివృద్ధి లో పంచాయతి సెక్రెటరీలే కీలకం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

*ఇబ్బందులు ఉంటే చెప్పండి పరిష్కరిస్తాం, చేయలేకపోతే వెళ్లిపోండి.
*సమయాన్ని వెచ్చించి ఎంతో బాధ్యతాయుతంగా పని చేయాలి.
*ఎల్ నినో నేపథ్యంలో ముందుచూపుతో పనిచేస్తేనే రాబోయే ఇబ్బందులను అధిగమిస్తాం.
*మల్టీ పర్పస్ వర్కర్ ల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
*పంచాయతీ సెక్రటరీ ల సమీక్ష సమావేశం లో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .


ప్రతిపక్షం మునుగోడు సెప్టెంబర్ 28: గ్రామాభివృద్ధిలో పంచాయతి సెక్రటరీలే కీలకమని వాళ్ళు బాధ్యతయుతంగా సమయం వెచ్చించి పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ప్రతి గ్రామంలో సెక్రెటరీ సమయపాలన పాటిస్తూ పారిశుధ్య సమస్యలు లేకుండా చేస్తేనే ప్రజలు ఎటువంటి రోగాల బారిన పడకుండా కాపాడగలుగుతామని మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు .

సోమవారం మునుగోడు లోని క్యాంపు కార్యాలయం లో మునుగోడు మండలం లోని 28 గ్రామాల పంచాయతి సెక్రటరీ లతో గ్రామాలలో నెలకొన్న సమస్యలు, గ్రామాల అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో ఆయా గ్రామాల్లో పారిశుద్ధం, త్రాగునీరు,వీధి దీపాల నిర్వహణ,వీధులను శుభ్రం చేయడం, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ కు సంబందించిన విషయాల పై కూలంకషంగా చర్చించారు… గ్రామాలలో పారిశుద్ధాన్ని మెరుగుపరచడానికి కావలసిన డ్రైనేజీ సిస్టం అభివృద్ధి చేయడానికి, త్రాగునీటి సమస్యలు అధిగమించడానికి చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.

సెక్రటరీల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని మెరుగ్గా పని చేసే సెక్రటరీలు మాత్రమే ఇక్కడ పని చేయాలని, మెరుగ్గా పని చేయకపోతే గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుందని అటువంటివారు వెళ్ళిపోవచ్చని సుతి మెత్తగా హెచ్చరించారు.. పనితీరు మెరుగు పరుచుకోవాలని ప్రతి నెలా పంచాయతీ సెక్రటరీ ల పనితీరు పై నివేదిక తెప్పించుకుంటానని వారి పనితీరును బట్టే గ్రామాల అభివృద్ధి ఆదారపడి ఉంటుందన్నారు. ఎల్ నినో పరిస్థితుల వల్ల రాబోయే కాలంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని… ఇప్పటినుండే ముందుచూపుతో పనిచేస్తేనే రాబోయే ఇబ్బందులను అధిగమిస్తామని అన్నారు..వచ్చే వేసవి లో త్రాగునీరు ఇబ్బందులు రాకుండా చూడడానికి కావాల్సిన ప్రణాళికలు రెడీ చేయాలన్నారు.గ్రామ పంచాయతీ లలో మల్టీ పర్పస్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని అన్నారు..ఈ సమీక్షా సమావేశం లో మునుగోడు ఎంపిడివో, ఎమ్మార్వో, ఎంపివో, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రెటరీ లు, మండల ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News