బోర్ వెల్ రీఛార్జ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ కావలి శివాని సురేష్.

*VB-G RAM G జలసిరి పనుల్లో భాగంగా గ్రామంలో పనులకు మార్కింగ్.

ప్రతి పక్షం చండూరు నవంబర్ 12 : భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న VB-G RAM G జలసిరి పనుల్లో భాగంగా, మంగళవారం ఉడుతలపల్లి గ్రామంలో బోర్ వెల్ రీఛార్జ్ గుంతల నిర్మాణ పనులకు అధికారులు మార్కింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆదర్శంగా నిలుస్తూ, గ్రామ సర్పంచ్ కావలి శివాని సురేష్ ముందుగా తన సొంత ఇంట్లో బోర్ వెల్ రీఛార్జ్ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామంలోని రైతులు, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ బోర్ల వద్ద రీఛార్జ్ గుంతలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కె. రవి, ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణ, ఈసీ (EC) యాదగిరి, టెక్నికల్ అసిస్టెంట్లు (TA) సత్యనారాయణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News