మెదక్ జిల్లా TUWJU యూనిట్‌కు ఉత్తమ సేవల పురస్కారం
హైదరాబాద్‌లో ఘనంగా 10వ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 12 తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJU) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శాంతినగర్ వెట్స్ గార్డెన్లో నిర్వహించిన 10వ వార్షిక రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం, నిషాన్-ఎ-సహాఫత్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు చెందిన రహేనుమా-ఎ-దక్కన్ ఉర్దూ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ మహ్మద్ ఇంతియాజుద్దీన్కు జర్నలిజం రంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును ప్రదానం చేశారు. ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షుజావుద్దీన్ ఇఫ్తిఖారీ ఈ అవార్డును అందజేసి ఇంతియాజుద్దీన్ను ఘనంగా సత్కరించారు.
అదేవిధంగా మెదక్ జిల్లా TUWJU యూనిట్‌కు కూడా ఉత్తమ సేవల అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్ర TMRIES చైర్మన్ ఫహీం ఖురేషి ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా యూనియన్ నాయకులు మహ్మద్ రియాజుద్దీన్, సయ్యద్ సఫ్దర్ అలీ, మహ్మద్ యూసుఫ్ అలీ, సూఫీ జానీ, డాక్టర్ జలాలుద్దీన్ అఫ్సర్ తదితర పాత్రికేయులు మహ్మద్ ఇంతియాజుద్దీన్ను అభినందించారు. తనకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందించిన రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు షుజావుద్దీన్ ఇఫ్తిఖారీతో పాటు సాజిద్ మీరాజ్, అథర్ మొయిన్, ముఫ్తీ రయీస్, నవాబ్ ఆలం తదితర రాష్ట్ర నాయకులకు, మెదక్ జిల్లా యూనియన్ నాయకులకు ఇంతియాజుద్దీన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ అవార్డు తనకు కేవలం గుర్తింపు మాత్రమే కాదని, మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. పాత్రికేయుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, యూనియన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.




























