పది రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

*అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని అధికారులకు ఆదేశం.

*రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టీకరణ.

*నల్లగొండ కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై ఉన్నత స్థాయి సమీక్ష

ప్రతి పక్షం నల్లగొండ నవంబర్ 13: నల్గొండ జిల్లాలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై ఆయన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పక్కా యాక్షన్ ప్లాన్ అమలు చేసి రాబోయే 10 రోజుల్లోగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. ధాన్యం విక్రయించే విషయంలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని, అవసరమైతే అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

*అత్యధిక ధాన్యం ఉత్పత్తి నల్లగొండలోనే..

రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి నల్లగొండ జిల్లాలో జరిగిందని అధికారులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి, కరువు పరిస్థితుల నేపథ్యంలో రాబోయే సీజన్‌లో సాగు చేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, అన్నదాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ (బత్తుల లక్ష్మారెడ్డి), ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Related News

Latest News