— జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్.
ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్ 13: జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో మురుగునీరు కలవకుండా శాశ్వత పరిష్కారం చూప డంతో పాటు, చెరువు పరిరక్షణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం అమృత్ 2.0, పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ తో కలిసి చింతకుంట చెరువు, గ్రేవ్‌యార్డ్ మరియు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే, డా. సంజయ్ కుమార్, మీడియాతో మాట్లాడుతూ చెరువుల పరిరక్షణకు ముఖ్యమంత్రి చొరవతో అమృత్ 2.0, పథకం కింద జగిత్యాల పట్టణంలోని మోతె చెరువు, చింతకుంట చెరువు, రాయి కల్ పెద్ద చెరువు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయ ని తెలిపారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యల కు శాశ్వత పరిష్కారం చూప డంతో పాటు, చెరువుల సహజ స్వరూపాన్ని కాపా డుతూ భావితరాలకు ఉప యోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు.
గతంలో మున్సిపాలిటీలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న సీనియర్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు పట్టణ అభివృద్ధి మరియు చెరువుల పరిరక్షణపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించా రు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీలపై నిర్మా ణాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల బఫర్ జోన్ పరిధిలో ఇళ్లు,వ్యాపారాలు ఏర్పడ్డాయని, వీటి ప్రభావం తో నేడు చెరువులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటు న్నాయని అన్నారు. గతంలో జరిగిన అక్రమ నిర్మాణాలపై సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యా నించారు. హైడ్రా తరహాలో జగిత్యాలలో కూడా చెరు వులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని గతంలో ఆ పెద్దమనిషి సూచించారని గుర్తుచేస్తూ, చెరువుల పరిరక్షణకు పటి ష్టమైన చర్యలు తీసుకోవా ల్సిన అవసరం ఉందని అన్నారు. బఫర్ జోన్ పరిధి లో ఎలాంటి అక్రమ నిర్మాణా లు జరగకుండా అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, లే అవుట్ నిబంధనల ప్రకారం నిర్మా ణాలు చేపట్టేలా చూడాలని సూచించారు. ఈ విషయం లో ప్రజలు కూడా అధికారు లకు సహకరించాలని కోరారు.
గతంలో నగరబాట కార్యక్రమం కింద నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ, అవి ప్రజ లకు పూర్తిస్థాయిలో ఉప యోగపడేలా లేవని అన్నా రు. ఎల్.ఎల్., గార్డెన్స్, నుంచి ధన్వంతరి ఆలయం వరకు 21, అడుగుల వెడ ల్పుతో రోడ్డు నిర్మాణం చేప ట్టేందుకు ప్రయత్నించగా, కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నానా యాగీ చేసి పనులను నిలిపివేశా రని, తద్వారా పట్టణ అభి వృద్ధికి ఆటంకం కలిగించా రని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిం చడం కాకుండా, పట్టణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.అమృత్ 2.0, పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 67, శాతం కేంద్ర ప్రభుత్వ వాటా 33, శాతం ఉందని, అయితే జీఎస్టీ రూపంలో 18, శాతం తిరిగి కేంద్రానికి వెళ్తుందని పేర్కొం టూ, కేంద్ర ప్రభుత్వ వైఖరి విత్తు వేసి పొత్తు కలిసినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
చింతకుంట చెరువు కేవలం చుట్టుపక్కల వార్డుల ప్రజల కే పరిమితమైనది కాదు.. యావత్ జగిత్యాల పట్టణ ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన నీటి వనరు, ఆహ్లాదకరమైన ప్రదేశం అని ఎమ్మెల్యే, పేర్కొన్నారు.ఇప్పటికే చింతకుంట చెరువు, మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చెంది, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పార్కులు, వినాయక నిమజ్జనం, బతుకమ్మ వేడుకలకు సంబంధించిన సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే చెరువు లోకి మురుగునీరు చేరడం ప్రధాన సమస్యగా ఉందని, మురుగునీరు చెరువులో కలవకుండా శాశ్వత పరి ష్కారం చూపేలా అమృత్ 2.0., పథకం కింద సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.మురుగునీటిని చెరువులోకి చేరకుండా మళ్లించడం, నీటి కాలుష్యా న్ని నివారించడం, చెరువు నీటి నాణ్యతను కాపాడటం వంటి అంశాలకు ప్రాధాన్యత నిస్తూ పనులు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిరక్షిస్తూ, చెరువును మరింత పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
చెరువుల పరిరక్షణ అనేది కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదని, భూగర్భ జలాల పెంపునకు, పర్యావరణ సమతుల్యత కు, గంగపుత్రుల జీవనోపా ధికి ఎంతో కీలకమని అన్నా రు. చెరువుల అభివృద్ధి వల్ల పట్టణ ప్రజలందరికీ ప్రయోజ నం చేకూరుతుందని, భవి ష్యత్తు తరాలకు ఆరోగ్యకర మైన పర్యావరణాన్ని అందిం చవచ్చని పేర్కొన్నారు.ప్రజల పన్నుల రూపంలో సమకూరిన నిధులను సద్వినియోగం చేస్తూ, చేపట్టే ప్రతి అభివృద్ధి పని నాణ్యతా ప్రమాణాలతో, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించేలా ఉండాలని అధికారులకు సూచించారు. చెరువుల పరిరక్షణలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేయా లని, భావితరాలకు సురక్షి తమైన నీటి వనరులను అందించడం మనందరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ, అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, ఈఈ ఖాన్, డి.ఈ, వరుణ్, ఎమ్మార్వో రామ్మోహన్, టీ.పి.ఓ., శ్రీనివాస్, కౌన్సి లర్లు బొల్లారపు స్వప్న, రజియొద్దీన్, అయూబ్ ఖాన్, బడుగు పద్మ రాజేందర్, దుమాల రాజ్ కుమార్, కూతురు రాజేష్, పిట్ట ధర్మరాజు, జంబర్తి గంగలక్ష్మి రాజ్ కుమార్ తదితర కౌన్సిలర్లు, పట్టణ ముఖ్య నాయకులు, వార్డు నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
































